బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశారంటూ యువతి ఫిర్యాదు

1 Min Read

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే **రేగా కాంతారావు**పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేయడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఇంటర్వ్యూ పేరుతో తనను ఫ్లాట్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి సన్నిహిత సంబంధం కొనసాగించారని, తర్వాత మోసం చేశారని పేర్కొంది.

అలాగే తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి వాటితో ఇబ్బందులకు గురిచేశారని, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులో ఆరోపించింది.

తన మొబైల్ ఫోన్‌కు యాక్సెస్ పొంది, తన స్నేహితురాలితో కూడా ఇదే విధంగా పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించారని బాధితురాలు పేర్కొంది.

ఈ ఫిర్యాదుపై జూలై 26న పంజాగుట్ట పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలం, అందుబాటులో ఉన్న ఆధారాలు, ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article