రూ.10కే యూరియా బుకింగ్.. తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

NEWS DESK
1 Min Read

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇకపై యూరియా బుకింగ్‌ను మీ సేవ కేంద్రాల ద్వారా కూడా చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు యాప్ ద్వారానే అందుబాటులో ఉన్న ఈ సేవను ఇప్పుడు టెక్నాలజీపై అవగాహన లేని రైతుల కోసం మరింత సులభతరం చేసింది.

రైతులు తమ మొబైల్ నంబర్‌తో ఓటీపీ ధృవీకరణ పూర్తి చేసి కేవలం రూ.10 రుసుం చెల్లించి యూరియా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ పూర్తయిన వెంటనే ప్రత్యేక బుకింగ్ ఐడీ జారీ అవుతుంది. ఈ ఐడీ 48 గంటల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ గడువులో రైతులు ఎంపిక చేసిన డీలర్ వద్దకు వెళ్లి యూరియా కొనుగోలు చేయవచ్చు.

చాలామంది రైతులకు యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్య రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేయడం కష్టమవుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సదుపాయం ప్రారంభించింది.

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానాన్ని ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు. యూరియా కోసం షాపుల ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా, పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రభుత్వం ఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.

📄 Generate e-Paper Clip
Share This Article