🔥 మంటల్లో కాలిపోయిన గుడిసె.. 🙏 మానవత్వం చాటిన రాఘవేంద్ర గౌడ్..

NEWS DESK
1 Min Read

మేడ్చల్ పట్టణంలోని వెంకటరామిరెడ్డి కాలనీలో నివసిస్తున్న కడమంచి లక్ష్మణ్, రేణుక దంపతుల గుడిసె ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం మంటల్లో కాలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురై నిరాశ్రయులుగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ మానవతా దృక్పథంతో స్పందించారు. బాధిత కుటుంబ పరిస్థితిని దగ్గరుండి తెలుసుకుని వారికి నిత్యావసర సరుకులతో పాటు కొత్త గుడిసె నిర్మాణం కోసం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.10,000 (పదివేల రూపాయలు) అందజేశారు.

అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం కూడా వారికి అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సహాయంపై స్థానికులు రాఘవేంద్ర గౌడ్ సేవాభావాన్ని అభినందించారు.

📄 Generate e-Paper Clip
Share This Article