NEET రీ-ఎగ్జామ్ 2026 అభ్యర్థులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటల్లో బ్యాంక్ వివరాల అప్‌డేట్ గడువు ముగింపు!

1 Min Read

జులై 7 రాత్రి 11:50 వరకు మాత్రమే అవకాశం.. ఫీజు రీఫండ్ కోసం వెంటనే వివరాలు నమోదు చేయండి

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక సూచన చేసింది. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో రిజిస్ట్రేషన్ ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించిన ఎన్టీఏ, బ్యాంక్ ఖాతా వివరాలను ధృవీకరించడానికి జులై 7 రాత్రి 11:50 గంటల వరకు చివరి గడువు ఇచ్చింది.

ఇప్పటివరకు 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంక్ వివరాలను అప్‌డేట్ లేదా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. గడువులోపు వివరాలు నమోదు చేయని అర్హులైన అభ్యర్థులు రీఫండ్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఎన్టీఏ హెచ్చరించింది. ఈ గడువు తర్వాత మరోసారి పొడిగింపు ఉండకపోవచ్చని స్పష్టం చేసింది.

జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ఫలితాలను జులై 20లోపు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ ఇప్పటికే ముగిసింది. అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి బ్యాంక్ వివరాల స్థితిని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అధికారిక NEET పోర్టల్‌లో కూడా బ్యాంక్ వివరాల అప్‌డేట్‌కు చివరి అవకాశం ఉన్నట్లు నోటీసు ఉంది

📄 Generate e-Paper Clip
Share This Article