తిరుమల భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. చర్లపల్లి-తిరుపతి మధ్య మరో స్పెషల్ ట్రైన్

NEWS DESK
1 Min Read

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, చర్లపల్లి-తిరుపతి స్పెషల్ ట్రైన్ (07819) జూన్ 25, 27 తేదీల్లో (గురువారం, శనివారం) నడుస్తుంది. ఈ రైలు సాయంత్రం 6:10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

అలాగే తిరుపతి-చర్లపల్లి స్పెషల్ ట్రైన్ (07820) జూన్ 26, 28 తేదీల్లో (శుక్రవారం, ఆదివారం) అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 3:00 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధీర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నాయి.

ప్రయాణికుల కోసం ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

ఇదిలా ఉండగా, తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. వేసవి సెలవుల సమయంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, పాఠశాలలు మరియు కళాశాలలు తిరిగి ప్రారంభం కావడంతో కొంత మేర తగ్గింది. దీంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రస్తుతం కాస్త సౌకర్యవంతమైన పరిస్థితులు నెలకొన్నాయి.

📄 Generate e-Paper Clip
Share This Article