హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తున్న ఇద్దరు బాలురు టిప్పర్ ఢీకొట్టడంతో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు బాలురు క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా టిప్పర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ (17), లక్ష్మీతేజ (17) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను సీజ్ చేశారు. అయితే ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.