మేడ్చల్: గర్భిణి అనుమానాస్పద మృతి

NEWS DESK
0 Min Read

తమ కూతురు సోనీ (19) గర్భిణిగా ఉన్నప్పుడు ఛాతి నొప్పితో మరణించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లి మల్కాజిగిరి కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు నెలల క్రితం విజయ్ను ప్రేమ వివాహం చేసుకున్న సోనీకి శనివారం ఉదయం ఛాతి నొప్పి రావడంతో భర్త తొలుత కామినేని ఆస్పత్రికి, అనంతరం యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అల్లుడు సమాచారం ఇవ్వడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article