మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల ఆలయంలో సుమారు 721 ఏళ్ల తర్వాత శుక్రవారం రోజున మహాహారతి నిర్వహించనున్నారు. ధార్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో గతంలో ముస్లింలు నమాజ్ చేసేవారు. అయితే, ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయమని తీర్పునిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో, మే 15న తీర్పు వచ్చిన తర్వాత తొలి శుక్రవారం కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్యక్రమం జరగనుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారమే భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.