ఇరాన్‌పై మళ్లీ దాడులు.. ఏఐ ఫొటోతో ట్రంప్ హెచ్చరిక

NEWS DESK
1 Min Read

ఇరాన్‌పై వైమానిక దాడులను మళ్లీ ప్రారంభించే అవకాశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న నిశ్శబ్ద పరిస్థితిని “తుఫానుకు ముందు ప్రశాంతత”గా అభివర్ణిస్తూ, శనివారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఓ ఏఐ సృష్టించిన చిత్రాన్ని ట్రంప్ పోస్టు చేశారు.

ఆ చిత్రంలో అమెరికా యుద్ధనౌకపై ట్రంప్ హెచ్చరిక చేస్తున్నట్లుగా, వెనుక భాగంలో ఇరాన్ నౌకలు ఉన్నట్లు చూపించారు. దీంతో అంతర్జాతీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ట్రంప్ చేసిన ఈ పోస్టు భవిష్యత్తులో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే సూచనలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ తాజా పోస్టు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

📄 Generate e-Paper Clip
Share This Article