NetiPrasthanam.in – Telugu News & Breaking News Updatesచెవిరెడ్డి భాస్కరరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ › e-Paper Clip NetiPrasthanam.in – Telugu News & Breaking News Updates
Share: f 𝕏 in @
netiprasthanam.in 01 Aug 2026, 12:48 pm
Date of Publish : 27 Jul 2026, 6:01 pm  |  Posted by : NEWS DESK
👁 2 💬 0
Latest News

చెవిరెడ్డి భాస్కరరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

చెవిరెడ్డి భాస్కరరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దొడ్డ వెంకట సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సందర్భంగా పిటిషనర్ లేవనెత్తిన పలు అభ్యంతరాలపై స్పందించిన సుప్రీంకోర్టు... భవిష్యత్తులో ఏవైనా అనుమానాలు లేదా అభ్యంతరాలు ఉంటే సరైన సమయంలో తగిన ఆధారాలతో కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

వైసీపీ అధినేత జగన్‌ ను ఈ కేసులో ఇరికించేందుకే సీఐడీ, సిట్ అధికారులు కుట్ర పన్ని దొడ్డ వెంకట సత్యప్రసాద్, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలను అప్రూవర్లుగా మారుస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన స్పెషల్ లీవ్ పిటిషన్ లో తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే సత్యప్రసాద్‌ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఆయన కోరగా, సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.