NetiPrasthanam.in – Telugu News & Breaking News Updatesరానా-త్రిష బంధంపై మళ్లీ చర్చ.. “మాది లవ్-హేట్ రిలేషన్‌షిప్” అంటూ… › e-Paper Clip NetiPrasthanam.in – Telugu News & Breaking News Updates
Share: f 𝕏 in @
netiprasthanam.in 01 Aug 2026, 12:47 pm
Date of Publish : 06 Jul 2026, 5:23 pm  |  Posted by : NEWS DESK
👁 12 💬 0
Latest News

రానా-త్రిష బంధంపై మళ్లీ చర్చ.. “మాది లవ్-హేట్ రిలేషన్‌షిప్” అంటూ హీరోయిన్ కామెంట్స్

రానా-త్రిష బంధంపై మళ్లీ చర్చ.. “మాది లవ్-హేట్ రిలేషన్‌షిప్” అంటూ హీరోయిన్ కామెంట్స్

హీరోయిన్ త్రిష కృష్ణన్, నటుడు రానా దగ్గుబాటి మధ్య రిలేషన్‌షిప్ ఉందంటూ గతంలో వచ్చిన ప్రచారాలు మరోసారి తెరపైకి వచ్చాయి. త్రిష గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రానాతో తనకున్న అనుబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

త్రిష మాట్లాడుతూ, తమకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉందని తెలిపారు. తాను చెన్నైలోని టీ నగర్‌లో ఉండేదాన్నని, ఎదురుగా డి. రామానాయుడు కుటుంబం నివసించేదని చెప్పారు. రానా కూడా చిన్ననాట చెన్నైలోనే ఎక్కువ కాలం గడపడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని వెల్లడించారు.

“మా కథకు ఎండ్ ఉండదు. కొన్నిసార్లు చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉంటాం. ఇంకొన్ని సార్లు అసలు మాట్లాడుకోం. మా బంధం లవ్-హేట్ రిలేషన్‌షిప్‌లా ఉంటుంది” అంటూ త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రానాను “లేడీస్ మ్యాన్” అని పిలవడంపై కూడా ఆమె స్పందించారు. “అవును, అతను లేడీస్ మ్యాన్.. అందులో సందేహమే లేదు” అంటూ నవ్వుతూ చెప్పారు. అయితే రానా వ్యక్తిత్వం తనకు చాలా ఇష్టమని, పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చినా ఎప్పుడూ గర్వంగా ప్రవర్తించడని తెలిపారు.

తమ మధ్య గొడవలు వచ్చినా, మాట్లాడుకోని సందర్భాలు ఉన్నా రానా అందరితో గౌరవంగా, మర్యాదగా ఉంటాడని త్రిష ప్రశంసించారు. అతను నిజమైన జెంటిల్‌మన్ అని, తనకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా జీవించే వ్యక్తి అని పేర్కొన్నారు.

తన కెరీర్ ప్రారంభంలో వర్షం సినిమా ఫోటోషూట్ సమయంలో రానాను తొలిసారి కలిశానని త్రిష గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి స్నేహం కొనసాగుతూనే ఉందని తెలిపారు.