NetiPrasthanam.in – Telugu News & Breaking News Updatesహైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. KBR పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్..… › e-Paper Clip NetiPrasthanam.in – Telugu News & Breaking News Updates
Share: f 𝕏 in @
netiprasthanam.in 01 Aug 2026, 9:45 am
Date of Publish : 22 Jun 2026, 8:00 am  |  Posted by : NEWS DESK
👁 14 💬 0
Latest News

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. KBR పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్.. భారీ ట్రాఫిక్ మళ్లింపులు!

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. KBR పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్.. భారీ ట్రాఫిక్ మళ్లింపులు!

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రత్యేక వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

జూన్ 21, 2026 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రధాన రహదారులపై వన్‌వే విధానం అమల్లో ఉండనుంది. ఈ సందర్భంగా పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కీలక ట్రాఫిక్ మళ్లింపులు

NFCL వైపు నుంచి వచ్చే వాహనాలు
సాగర్ సొసైటీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం.36, రోడ్ నెం.45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమవైపు తిరిగి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, అగ్రసేన్ ఐలాండ్, ఒమేగా హాస్పిటల్, భారతీయ విద్యాభవన్ మార్గం ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చే వాహనాలు
జూబ్లీహిల్స్, మాదాపూర్, రోడ్ నెం.36, రోడ్ నెం.45 వైపు వెళ్లేవారు ఇందిరానగర్ గడ్డ రోడ్, వెంకటగిరి జంక్షన్, డైమండ్ హౌస్, అల్-కాజర్ మార్గాలను వినియోగించాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా అన్నపూర్ణ స్టూడియో బైలేన్ ద్వారా ఎన్టీఆర్ భవన్ చేరుకుని అక్కడి నుంచి ఫిలింనగర్, షేక్‌పేట్ వైపు వెళ్లవచ్చు.

ITC కోహినూర్, కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, పంజాగుట్ట వైపు వెళ్లేవారు రోడ్ నెం.60, 67, రోడ్ నెం.1 మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

వాహనదారులకు సూచనలు

  • ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులను తప్పనిసరిగా పాటించాలి.
  • నిర్దేశిత మార్గాల్లో యూ-టర్న్‌లకు అనుమతి ఉండదు.
  • ఎడమవైపు లేన్‌లో ప్రయాణిస్తూ సూచించిన ఎగ్జిట్ పాయింట్లను వినియోగించాలి.
  • ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రోడ్డు సైన్‌బోర్డులను తప్పనిసరిగా అనుసరించాలి.
  • రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచారం కోసం నావిగేషన్ యాప్‌లను ఉపయోగించాలి.
  • ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలైనంత వరకు ప్రజా రవాణా లేదా కార్‌పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.