ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆధునిక అటవీ పరిశోధన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు అంగీకారం పొందారు. టైగర్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, జన్యు వైవిధ్యం కోసం 6 ఆడపులుల అవసరాన్ని కేంద్రానికి వివరించారు. గోదావరి కాలుష్యంపై సీపీసీబీ బృందాన్ని పంపాలని కూడా కోరారు.