అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 15: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై కూడా పట్టు సాధించాలని జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ ప్లానింగ్ ప్రొఫెసర్ వి. కామాక్షి ప్రసాద్ సూచించారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుంతపల్లిలోని అవంతి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన “కాన్ఫ్లూయెన్స్ అలుమ్ని-2026” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అవంతి కళాశాల చైర్మన్ శ్రీనివాస్‌రావు, ప్రొఫెసర్ కృష్ణమోహన్, రమణయ్యలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడిన కామాక్షి ప్రసాద్, పూర్వ విద్యార్థుల అనుభవాలు ప్రస్తుత విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేసి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.
అవంతి కళాశాల చైర్మన్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ, అలుమ్ని నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు ఉద్యోగ, ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.