ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌కు తేదీ ఖరారు.. వీటిపై భారీ ఆఫర్లు

NEWS DESK
1 Min Read

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ తేదీని సంస్థ అధికారికంగా ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ మెగా సేల్ ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు మాత్రం ఆగస్టు 7 నుంచే ముందస్తు యాక్సెస్ లభించనుంది.

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ ఎస్25, మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11+ వంటి ప్రముఖ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి.

అలాగే 55 అంగుళాల శాంసంగ్ 4కే స్మార్ట్ టీవీ, శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ల్యాప్‌టాప్‌పై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులు అందుబాటులోకి రానున్నాయి. అర్హత కలిగిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుండగా, ఈఎంఐ కొనుగోళ్లకు కూడా ఈ ఆఫర్ వర్తించనుంది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా ఉండనున్నాయి.

ఈసారి సేల్‌లో India’s Top Deals, Deals of the Day, Price Crash, Rush Hours, Tick Tock Deals, Made in India Offers వంటి ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి ఉత్పత్తిపై ఎంత మేర తగ్గింపు ఉంటుందనే పూర్తి వివరాలను సేల్ ప్రారంభానికి ముందు వెల్లడించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

📄 Generate e-Paper Clip
Share This Article