లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

NEWS DESK
1 Min Read

కోలీవుడ్‌లో హిట్ డైరెక్టర్‌గా గుర్తింపు సాధించిన లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటిన లోకేశ్…  హీరోగా ‘డీసీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయన నిర్మాతగా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాల్ వెంకట్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో నటించబోతోందట. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని, సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని చెబుతున్నారు. 

లోకేశ్ కనగరాజ్ ‘డీసీ’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తన తదుపరి ప్రాజెక్టులపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌గా, హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమా ఇండస్ట్రీలో తన ముద్ర వేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా రెజీనా కసాండ్రా మరో మంచి అవకాశం కొట్టేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article