AP: విజయవాడలోని కృష్ణలంకలో సాయికృష్ణ అనే వ్యక్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి, దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిపారు. తప్పు చేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని సీఎం పేర్కొన్నారు.