AP: సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపారని YCP నేత అంబటి రాంబాబు ఆరోపించారు. మృతదేహాన్ని టూ వీలర్‌పై శ్మశానవాటికకు తీసుకెళ్లి అర్ధరాత్రి తగులబెట్టేశారని ఆరోపించారు. కోర్టు ఎదుట మాత్రం వెతుకుతున్నామని అబద్ధాలు చెప్పారని, రక్షకభట నిలయంలోనే ఈ దారుణం జరిగిందని ఆయన అన్నారు. మృతుడి మేనమామ జనసేన పార్టీలో చురుకైన కార్యకర్త అని తెలిపారు.
