గుత్తి ఇన్ఛార్జ్ వ్యవసాయాధికారి మహబూబ్ బాషా శనివారం ఒక ప్రకటనలో 2026 ఖరీఫ్ సీజన్లో రైతులకు 40% సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేస్తామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రెండు రకాల విత్తన కాయలను పంపిణీ చేస్తారని, జూన్ 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
