మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ బుద్దానగర్‌లో తాగునీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, స్థానికులతో కలిసి కాలనీల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సమర్థవంతంగా తాగునీరు అందేదని తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు తాగునీటి కోసం వాటర్ ట్యాంకర్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

నీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.