ఐపీఎల్-2026 మ్యాచ్‌ల సందర్భంగా ప్రయాణికులకు సౌకర్యార్థం మెట్రో రైలు సేవల సమయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ పొడిగించింది. ఉప్పల్ వేదికగా RCB, SRH జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అభిమానులు ముందస్తుగా రిటర్న్ జర్నీ టికెట్లు, స్మార్ట్ కార్డ్‌లు లేదా డిజిటల్ క్యూఆర్ (QR) టికెట్లను కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
